

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే మన బ్రాహ్మణ భక్తుల కోసం 1988 సంవత్సరంలో శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నసత్రాన్ని ప్రారంభించడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంకు సంబంధించి 128 అనువంశిక అర్చక కుటుంబాల ఘర్పట్టి ఒక లక్ష 25 వేల రూపాయల మూలనిధితో ప్రారంభించిన నిత్యాన్న సత్రం అంచెలంచెలుగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుండి అద్దె భవనంలో కొనసాగుతున్న మన సత్రం దాదాపు 20 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ నమిలకొండ కోటయ్య గారి కృషితో, శ్రీ శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో శంకరమఠం వెనుక భాగంలో మన సత్రం నిర్విరామంగా కొనసాగుతుంది.ఇప్పటివరకు శ్రీ స్వామివారి కరుణాకటాక్షాలతో లక్షలాదిమంది భక్తులు అన్నదాన యజ్ఞంలో పాల్గొన్నారు. కేవలం అన్నదానమే కాకుండా వివిధ ప్రాంతాల్లోని బ్రాహ్మణులకు అన్నదానం చేసినాము. వివిధ ప్రాంతాల్లో ఉన్న మనవారి కోసం, వేములవాడ బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించు కున్నారు. నామకరణం, కేశఖండనం, ఉపనయనం, ,వివాహాది శుభకార్యాలు , జన్మదిన & వివాహాది వార్షికోత్సవాలు మరియు వివిధ సంప్రదాయక కార్యక్రమాలు మన సత్రంలో చేసుకుంటూ సహాయ, సహకారాలు అందిస్తున్నారు.ఇకముందు కూడా మీ అందరి సహాయ సహకారాలతో మన సత్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకొని, రాబోయే రోజుల్లో బ్రాహ్మణ భక్తులకు సేవ చేస్తామని ఆకాంక్షిస్తూ…..



“This collective Lalitha and Gayathri Japam is being performed with a sacred intention for global peace, harmony, and well-being. Devotees from different places are joining together in prayer, chanting the divine mantras and contributing their japam counts as an offering for the welfare of the world.” 🕉️

Loading…
Loading…

Designed to provide peaceful Ashraya for pilgrims visiting the holy shrine of Vemulawada.

The project is initiated and managed by the Brahmin Seva Sangham and the hereditary trustee board of the Sri Raja Rajeshwara Brahmana Nityanna Satram.
The building plan includes a large hall and sixteen individual accommodation rooms.
The parent organization, Sri Raja Rajeshwara Brahmana Nityanna Satram, has been serving pilgrims for over 31 years.