Up Coming Projects

దేశంలో ఎంతో గొప్ప ప్రసిద్ధి చెందిన వేములవాడ పుణ్యక్షేత్రంలో ఒక ఆధ్యాత్మిక మాసపత్రికఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది !
రాజరాజేశ్వరుడు అనగానే ఎవరికైనా వేములవాడ స్ఫురణలోకి వస్తుంది .
అందుకే
“శ్రీ రాజరాజేశ్వరమ్ “
అనే పేరును ఈ పత్రికకు ప్రతిపాదిస్తూ కొన్ని వివరాలను తెలుపుతున్నాను !
ముఖ్యంగా ఈ పత్రిక ద్వారా
శివ సంబంధమైన సాహిత్యాన్ని ప్రజలకు తెలియజేయడం ప్రధాన లక్ష్యం !
శివ సహస్రనామాలు ప్రజలందరికీ చేరువలోకి వెళ్లడం కూడా ఒక ప్రధాన లక్ష్యమే !
వీటితోపాటు సమాజంలో శివుడికి సంబంధించిన రకరకాల విశేషాలను మరుగున పడిపోయిన ఎన్నో నూతన విశ్లేషణలను అందించడానికి ఈ పత్రిక ఉపయోగపడుతుంది.
వేములవాడ శివుడి పై అద్భుతమైన స్తోత్ర సాహిత్యం ఎంతగానో ఉంది దీనితోపాటు ప్రజల నాలుకలలో నిత్యం విహరిస్తున్న జానపద గేయ వాంగ్మయం కూడా ఎంతగానో ఉంది !
వీటిని ఈ రకంగా భద్రపరచాల్సిన అవసరం ఉంది !
వీటితోపాటు
దేవాలయంలోని వివిధ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం కూడా పత్రిక లక్ష్యాలలో ఒకటి !
వేములవాడ ఒక చారిత్రిక పుణ్యక్షేత్రం !
దీని చరిత్ర కాలక్రమములో మరుగున పడిపోతుంది .
ఈ అద్భుతమైన దేశీయ చరిత్రను పునరుద్ధరించడానికి ఇలాంటి పత్రికలు సహాయపడతాయి !

ప్రస్తుతం వేములవాడ బ్రాహ్మణ సంఘం పేరుతో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి ఇది ఒక వాహినిగా ఉపయోగపడుతుంది !
ఎక్కడో ఉన్న బ్రాహ్మణ సోదరులుతమ అభిప్రాయాలను తెలుపుతూ ఆర్థిక సహాయ కార్యక్రమాలను చేయడానికి వీలుగా స్పందించడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది !
ఇలా
బహుళార్థసాధకమైన ఒక మాధ్యమంగా ఈ పత్రిక ఉండాలని ఆశిస్తూ