
1998 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా అనువంశిక హక్కు కోల్పోయిన సందర్భంలో మన హక్కుల పునరుద్ధరణకై, మన బ్రాహ్మణుల సంక్షేమం కొరకు మన వేములవాడలో ఉన్నటువంటి బీద బ్రాహ్మణ కుటుంబాల సహాయం కొరకు మరియు అన్ని రకాల శుభా కార్యక్రమాలలో సేవా నిమిత్తము బ్రాహ్మణ యువజన సేవా సంఘం అని అప్పటి బ్రాహ్మణ యువకులంతా కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వినాయక నవరాత్రులు ప్రారంభం చేసి తద్వారా బ్రాహ్మణ కుటుంబాల ఐకమత్య సాధన కొరకు కృషి చేసి లింగార్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించి వాటి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతో మన వంట పాత్రలు మనకే ఉండాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతో ప్రారంభమైనటువంటి యువజన యాత్ర కాలానుగుణంగా చాలా కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చింది పెద్దలందరికీ సహకరిస్తూ సత్రం యొక్క పునరుద్ధరణ విషయంలో సత్ర నిర్వహణలో యువజన సేవా సంఘం పాత్ర ఎంతో ఘననీయమైనది చాలా వైభవంగా వినాయక నవరాత్రాలు నిర్వహిస్తూ అన్ని జాతీయ పండుగలను నిర్వహించడం, రక్తదాన శిబిరాలను నిర్వహించడం, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని నింపడం కొరకు అనేక రకాల ఆటలు పోటీలు నిర్వహించడం, బ్రాహ్మణ జాతి మీద జరిగినటువంటి దాడులను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేయడం పోరాటాలు చేయడం, రాష్ట్రస్థాయి బ్రాహ్మణ సంఘాల సమావేశాలు వేములవాడ నిర్వహించడం, విజయవాడ హైదరాబాదులలో జరిగినటువంటి బ్రహ్మగర్జన లాంటి పెద్దపెద్ద సభలకు అందరు కలిసి వెళ్లడం, యువతలో మంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించడం లాంటి ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహణ.
కోవిడ్ సమయంలో భార్గవ సేవా సంస్థ పేరు మీద 25 కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయడం అదేవిధంగా అనేక కుటుంబాలకు ఆహార వస్తువులు సరఫరా చేయడం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది














